తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అతిథి పాత్రలో మరోసారి అక్కినేని వారసుడు! - సమంత న్యూస్​

టాలీవుడ్​ చిత్రాల్లో స్టార్​ హీరోలు, దర్శకులు పలు చిత్రాల్లో అతిథిపాత్రల్లో నటించి మెప్పించారు. 'మహానటి', 'ఓ బేబీ' సినిమాల్లో కొద్దిసేపు కనువిందు చేసిన నాగచైతన్య.. మరోసారి అలాంటి పాత్రలో మెరవబోతున్నాడని సమాచారం.

Akkineni Nagachaitanya will be lead a guest role in Samantha, Nandini Reddy Movie
అతిథిపాత్రలో మరోసారి అక్కినేని వారసుడు!

By

Published : Apr 14, 2020, 6:03 AM IST

సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఓ బేబీ'. ఈ సినిమాలో నాగ చైతన్య అతిథి పాత్రలో కనువిందు చేశాడు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో తెరపై కనిపించనున్నాడని సమాచారం. సామ్‌తో నందిని రెడ్డి మరో చిత్రం తీయబోతుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా కూడా నాయిక ప్రాధాన్యంగా రూపొందుతుందని సమాచారం​. ఇందులోనే చైతూ ప్రత్యేక పాత్రలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'లవ్‌స్టోరీ' చిత్రంతో బిజీగా ఉన్నాడు.

'ఓ బేబీ' సినిమా పోస్టర్​

ఇదీ చూడండి.. శ్రుతిమించితే ఏదైనా ముప్పే: రాశీ

ABOUT THE AUTHOR

...view details