'మజిలీ'తో హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు హీరో నాగచైతన్య. 'ఫిదా' తర్వాత మరో సినిమా చేయలేదు దర్శకుడు శేఖర్ కమ్ముల. వీరిద్దరూ కలిసి ఇటీవలే కొత్త చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇందులో తెలంగాణ యాసతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు అక్కినేని హీరో. అందుకోసం శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం.
'ఫిదా'లో భానుమతిగా ఆకట్టుకున్న సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈసారి ప్రేక్షకుల్ని ఎలా మాయ చేస్తుందో చూడాలి.