టాలీవుడ్ హీరో సుమంత్.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మామ నాగార్జునతో కలిసి 'స్నేహమంటే ఇదేరా!' చిత్రంలో నటించి ఉండకూడదని అన్నాడు. వీటితో పాటే మరికొన్ని విషయాలు పంచుకున్నాడు.
'నాగార్జునను కొట్టడం అభిమానులకు నచ్చలేదు' - entertainment news
కథానాయకుడు సుమంత్.. తన కెరీర్లో ఓ రెండు సినిమాలు చేసుండాల్సింది కాదని అన్నాడు. మామ నాగార్జునతో కలిసి నటించాల్సి ఉండకూడదని చెప్పాడు.
''స్నేహమంటే ఇదేరా'లో నటించి, తప్పు చేశాను. చినమామ నాగార్జున, నేను.. స్నేహితులుగా కనిపించడం, అభిమానులు నచ్చలేదు. ఇందులోని ఓ సన్నివేశంలో మామను కొట్టడం ఫ్యాన్స్‌కు రుచించలేదు. స్క్రిప్ట్‌లోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే విధంగా 'పెళ్లి సంబంధం' చిత్రం.. కెరీర్లో నేను చేసిన ఓ తప్పు. తాత అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు కోసమే దానిని ఒప్పుకున్నా. ఆ స్క్రిప్ట్‌లోనూ కొన్ని సమస్యలున్నాయి. ఈ రెండూ సినిమాలు నన్ను తీవ్రంగా నిరాశపర్చాయి' -సుమంత్, కథానాయకుడు
ప్రస్తుతం ఇతడు 'కపటధారి' అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కన్నడ థ్రిల్లర్ 'కవాలుదారి'కి రీమేక్ ఇది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతమేర చిత్రీకరణ జరిగింది. కరోనా కారణంగా ప్రస్తుతం అది నిలిచిపోయింది.