తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గీత గోవిందం' దర్శకుడితో అఖిల్​..! - గీత గోవిందం దర్శకుడు

అక్కినేని అఖిల్​ కథానాయకుడిగా నాలుగో చిత్రం తెరకెక్కనుంది. 'గీత గోవిందం'తో భారీ విజయాన్ని అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని సమాచారం. అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నాడట.

అక్కినేని అఖిల్

By

Published : Aug 25, 2019, 12:59 PM IST

Updated : Sep 28, 2019, 5:09 AM IST

'అఖిల్'​ చిత్రంతో తెరంగేట్రం చేశాడు అక్కినేని యువహీరో అఖిల్. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న హీరో కొత్తగా మరో చిత్రం చేయడానికి సిద్ధమయ్యాడట. ఇప్పటికే పలువురు దర్శకులతో అఖిల్​ సినిమా చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. చివరకు... 'గీత గోవిందం'తో హిట్​ అందుకున్న దర్శకుడు పరశురామ్​కు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కథలో ఓ లైన్​ను అఖిల్​, నాగార్జునకు వివరించాడట పరశురామ్​. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్​ రాసుకురమ్మన్నారని వార్తలు వినిపించాయి. ప్రస్తుతానికి కథ పూర్తయ్యిందని, త్వరలో షూటింగ్​ మెుదలుకానుందని తెలుస్తోంది. హీరోయిన్​గా ఎవరు నటిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.

'అఖిల్'​తో మాస్​ హీరోగా తెరంగేట్రం చేసిన అఖిల్.. ఆ సినిమా పరాజయంతో 'హలో'లో క్లాస్​ లుక్​లో కనిపించాడు. ఈ చిత్రమూ బోల్తాకొట్టాక లవ్​స్టోరీ 'మిస్టర్​ మజ్ను'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇదీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్​ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

ఇదీ చూడండి: బోల్డ్ పాత్రలో రాశి.. కొత్త చిత్రం షురూ

Last Updated : Sep 28, 2019, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details