తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుర్రంపై అఖిల్​.. 'డయల్​ 100' అంటున్న మనోజ్​ - ప్రియాంకా చోప్రా వార్తలు

టాలీవుడ్​ యంగ్​ హీరో అక్కినేని అఖిల్​ తన పెంపుడు గుర్రంపై సరదాగా స్వారీ చేస్తున్నారు. గుర్రం స్వారీతో రోజును ప్రారంభించడం బాగుంటుందని ఇన్​స్టాలో వీడియో షేర్​ చేస్తూ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్​గా మారింది. అలాగే బాలీవుడ్​ నటుడు మనోజ్​ బాజ్​పేయి తన కొత్త సినిమా ప్రకటించగా.. 'రాధేశ్యామ్​' సెట్లో ప్రభాస్ ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

akkineni akhil horse riding and manoj bajpai new movie update
గుర్రంపై అఖిల్​.. 'డయల్​ 100' అంటున్న మనోజ్​ బాజ్​పేయి

By

Published : Dec 1, 2020, 5:52 PM IST

అక్కినేని అఖిల్ సినిమాలతో పాటు కొన్ని అదనపు విషయాలను కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 'దినచర్యను గిజెల్‌ (గుర్రం పేరు) స్వారీతో ప్రారంభించడం బాగుంటుంది' అని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఆ వీడియోలో అఖిల్‌ గుర్రాన్ని చాలా వేగంగా పరిగెత్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్'‌ సినిమాలో అఖిల్​ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంతో అఖిల్​ ఓ చిత్రం చేయనున్నారు.

'డయల్​ 100'తో మనోజ్ బాజ్​పేయి

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి, నీనా గుప్తా, సాక్షి తన్వర్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'డయల్‌ 100'. రెన్సిల్ డిసిల్వా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం మంగళవారం ముంబయిలో లాంఛనంగా ప్రారంభమైంది. సోనీ పిక్చర్స్, అల్కెమీ ఫిల్మ్స్లలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా, స్వప్నాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'రాధేశ్యామ్​' సెట్లో ప్రభాస్​

డార్లింగ్​ ప్రభాస్​ తన కొత్త చిత్రం 'రాధేశ్యామ్'​ షూటింగ్​ సెట్లో సందడి చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలో యాక్షన్​ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

'రాధేశ్యామ్​' సెట్లో ప్రభాస్​

రెండో వార్షికోత్సవం

స్టార్​ కపుల్​ ప్రియాంకా చోప్రా, నిక్​ జోనాస్​ రెండో పెళ్లి వార్షికోత్సవం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక.. ఓ ఫొటోను సోషల్​మీడియాలో షేర్​ చేస్తూ తన భర్తకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నిక్​ జోనాస్​, ప్రియాంకా చోప్రా

ABOUT THE AUTHOR

...view details