తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన కేసులో జావేద్​ అక్తర్ వాంగ్మూలం​

కంగన వ్యాఖ్యలపై రచయిత జావేద్ అక్తర్ కోర్టును ఆశ్రయించారు​. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై తదుపరి విచారణను డిసెంబరు 19కి కోర్టు వాయిదా వేసింది.

Akhtar submits statement in defamation plaint against Kangana
కంగన కేసులో వాంగ్మూలాన్ని సమర్పించిన జావేద్​ అక్తర్​

By

Published : Dec 3, 2020, 6:26 PM IST

నటి కంగనా రనౌత్​ తనపై చేసిన ఆరోపణల విషయమై ప్రముఖ రచయిత జావేద్​ అక్తర్ కోర్టును ఆశ్రయించారు. గురువారం అందుకు సంబంధించిన వాంగ్మూలాన్ని ఇచ్చారు. తన న్యాయవాది ద్వారా ఆ వాంగ్మూలాన్ని కోర్టు ముందుంచారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన నటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కంగన గత నెలలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పేరు ప్రస్తావించిందని, తన కీర్తికి భంగం కలిగించిందని జావేద్​ అక్తర్ ఫిర్యాదులో​ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. కంగన చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్‌ తెలిపారు.‌ ఈ కేసుకు సంబంధించి వాదనలను విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను డిసెంబరు 19కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:కంగనపై పరువునష్టం దావా వేసిన జావేద్​

ABOUT THE AUTHOR

...view details