తెలంగాణ

telangana

By

Published : Jul 12, 2021, 1:45 PM IST

ETV Bharat / sitara

Agent - RAPO19: కుర్రహీరోలు ప్రారంభించేశారు!

టాలీవుడ్​లో కొత్త సినిమాలు జోరు పెంచేశాయి. నేటి(సోమవారం) నుంచి అఖిల్​ 'ఏజెంట్​'(Agent) షూటింగ్​తో పాటు రామ్​-లింగుస్వామి సినిమా(RAPO19) చిత్రీకరణ ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ఇరు చిత్రబృందాలు రెండు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి.

Akhil's Agent - RAPO19 Movies Shooting Starts
Agent - RAPO19: కొత్త సినిమాల షూటింగ్​ ప్రారంభం

వరుస హిట్లతో మంచి జోష్‌ మీదున్నారు టాలీవుడ్‌ యువ కథనాయకుడు రామ్‌ పోతినేని(Ram potineni).. కోలీవుడ్​ దర్శకుడు లింగుస్వామితో(Linguswamy) తన కొత్త చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు. కృతి శెట్టి(Krithi Shetty) కథానాయిక. నేటి (సోమవారం) నుంచి చిత్రీకరణ ప్రారంభించినట్లు చిత్రబృందం ప్రకటించింది.

రామ్​ - లింగుస్వామి సినిమా షూటింగ్​ ప్రారంభం

చాలాకాలం కిత్రమే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల సినీ కార్యకలాపాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు రావడం వల్ల సినిమాను పట్టాలెక్కించారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. #RAPO19 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమా పేరును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

'ఏజెంట్​' షురూ

సురేందర్​ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో అక్కినేని అఖిల్​ 'ఏజెంట్​'(Agent) సినిమా చేస్తున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా కోసమే అఖిల్​ (Akhil Akkineni) జిమ్​లో వర్కౌట్లు చేస్తూ బాగా కష్టపడుతున్నారు. ఈ సినిమాలోని అఖిల్​ సిక్స్​బాడీ లుక్​ను చిత్రబృందం విడుదల చేసి.. నేటి(సోమవారం) నుంచి షూటింగ్​ మొదలుపెట్టినట్లు కూడా వెల్లడించింది.

'ఏజెంట్​' సినిమా షూటింగ్​ ప్రారంభం

గతంలో ఎన్నడూ లేని విధంగా బీస్ట్​ లుక్​లో అభిమానులను అలరించేందుకు అఖిల్​ సిద్ధమయ్యారు. ఇలాంటి దేహం కోసం తాను 365 రోజులు కష్టపడినట్లు అఖిల్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన అఖిల్​ జిమ్​ లుక్​.. అభిమానుల్ని విపరీతంగా అలరిస్తోంది. సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య(Sakshi Vaidya) కథానాయిక.

ఇదీ చూడండి..'రామారావు'గా రవితేజ.. బాలీవుడ్​కు 'ఆకాశం నీ హద్దురా'​

ABOUT THE AUTHOR

...view details