తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దాన్నుంచి బయటకు రావడం కష్టం: అఖిల్ - akhil king koduku

స్టార్​కిడ్ అనే చట్రం నుంచి బయటకు రావడం కష్టమని హీరో అఖిల్ అన్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్'గా అలరించిన ఆయన.. ప్రస్తుతం 'ఏజెంట్​'తో బిజీగా ఉన్నారు.

akhil
అఖిల్

By

Published : Nov 7, 2021, 10:22 PM IST

'సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం విశేషమే కానీ స్టార్‌కిడ్‌ అనే దాన్నుంచి బయటకు రావడం ఓ సవాలు' అని అఖిల్‌ అక్కినేని అన్నారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున కొడుకుగా తెరంగ్రేటం చేసిన అఖిల్‌ తనని తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో మంచి విజయం అందుకున్న ఆయన ఆంగ్ల మీడియాతో తన మనసులో మాట పంచుకున్నారు. తదుపరి చిత్ర విశేషాల్ని తెలియజేశారు.

'ఎవరికైనా సినీ నేపథ్యం ఉండటం ఓ రకంగా మంచిదే కానీ, అంతకుమించిన ఒత్తిడీ ఉంటుంది. ప్రముఖ నటుడి మనవడిగానో/కొడుకుగానో ప్రేక్షకులకు పరిచయం అయితే సినిమా సినిమాకీ అభిమానుల్లో అంచనాలు పెరుగుతుంటాయి. ఈ నేపథ్యం నుంచి బయటకు వచ్చి నాకు నేనుగా నిలబడటం ఓ ఛాలెంజ్‌. ఈ సవాలు స్వీకరించి నన్ను నేను నిరూపించుకునేందుకు కష్టపడుతున్నా. నేనేంటో ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. నా పరిధుల్ని అధిగమించి ఎక్కడి వరకూ వెళ్లగలనో అక్కడికి వరకూ వెళ్తా. దాని కోసం శ్రమిస్తా. ఇతరత్రా ఆలోచనలన్నీ పక్కనపెట్టి పనిమీదే దృష్టిసారిస్తున్నా. ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ చిత్రంలో నటిస్తున్నా. ఇదొక గూఢచారి కథ. ఇందులో పూర్తిస్థాయి యాక్షన్‌ ఉంటుంది. నేను ఇప్పటి వరకూ నటించని జానర్‌. ఎంతో నమ్మకంగా చేస్తోన్న చిత్రమిది. అందరినీ మెప్పిస్తుందనుకుంటున్నా' అని అఖిల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details