తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అఖిల్​ సినిమా ట్రైలర్​..  సాంగ్స్​తో 'మహాసముద్రం', 'కొండపొలం' - movie updates

మిమ్మల్ని పలకరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌​', 'అరన్​​ మనాయ్​ 3' ట్రైలర్స్((Most eligible bachelor trailer)​ సహా 'మహా సముద్రం', 'కొండపొలం' చిత్రంలోని సాంగ్స్​ విడుదలయ్యాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Sep 30, 2021, 6:27 PM IST

Updated : Sep 30, 2021, 6:43 PM IST

అక్కినేని అఖిల్ అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. అఖిల్‌ హీరోగా నటించిన 'మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' ట్రైలర్‌(Most eligible bachelor trailer) విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. కొవిడ్‌ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. లవ్‌, కామెడీ తదితర అంశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అఖిల్‌, పూజా హెగ్డే జోడీ(akhil akkineni pooja hegde) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

శర్వానంద్, సిద్ధార్థ్‌(sharwanand and siddharth movie) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'మహా సముద్రం'(Mahasamudram movie release date). అను ఇమ్మాన్యుయేల్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే 'హే తికమక మొదలే' అనే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. చైతన్ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చారు. హరిచరణ్‌, నూతన మోహన్‌ ఆలపించారు. ఈ లిరికల్‌ వీడియోలో శర్వా- అను, సిద్ధు- అదితి జోడీగా కనిపించి అలరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన 'హే రంభ' గీతం, ట్రైలర్‌(mahasamudram trailer) విశేషంగా అలరించాయి.

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌(vaishnav tej rakul preet singh movie) జంటగా నటిస్తోన్న చిత్రం 'కొండపొలం'(kondapalem movie release date). క్రిష్‌ దర్శకుడు. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని మెలోడీ గీతం 'శ్వాసలో'ను విడుదలచేసింది చిత్రబృందం. ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

తమిళ హీరో ఆర్య నటిస్తున్న కొత్త చిత్రం 'అరన్​​ మనాయ్​ 3'(aranmanai 3 movie release date). హారర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్​(aranmanai 3 movie trailer) విడుదలై ఆకట్టుకుంటోంది. రాశీఖన్నా హీరోయిన్​. సుందర్​ సి దర్శకుడు. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

ఇదీ చూడండి: రిలీజ్​ డేట్​తో 'గంగూబాయ్​', 'మైదాన్​'.. ఆసక్తిగా 'నల్లమల' టీజర్​

Last Updated : Sep 30, 2021, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details