తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పెళ్లి సందD' సాంగ్​.. అఖిల్​ సినిమా సెన్సార్​ పూర్తి​ ​ - natyam movie release date

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పెళ్లి సందD', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్', 'నాట్యం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాల సంగతులు ఉన్నాయి.

cinema
సినిమా అప్డేట్స్​

By

Published : Sep 29, 2021, 3:57 PM IST

'పెళ్లి సందD' (pelli sandadi new movie) సినిమాలోని 'మధుర నగరిలో' సాంగ్​ విడుదలై ఆకట్టుకుంటోంది. మాస్​ మహారాజా రవితేజ రిలీజ్ చేశారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు(pelli sandadi 2021 trailer).. ఈ చిత్రంతోనే నటుడిగా పరిచయమవుతున్నారు. గౌరి రోనంకి దర్శకురాలు.

శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'(adavallu meeku joharlu new movie). కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నేడు(సెప్టెంబరు 29) ఖుష్బూ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. రాధిక, ఖుష్బూ, ఊర్వశి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఖుష్బూ

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(Most Eligible Bachelor Release Date). ఈ సినిమా సెన్సార్​ పనులు పూర్తైనట్లు తెలిపింది చిత్రబృందం. యూ/ఏ దక్కించుకున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 15న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​

'నాట్యం(natyam movie release date) అంటే ఒక కథను అందంగా చెప్పడం'.. ఈ మాటలు తనకు 'స్వర్ణకమలం' రోజుల్ని గుర్తు చేస్తున్నాయని అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన 'నాట్యం'లోని ఓ సరికొత్త పాటను బుధవారం వెంకీ విడుదల చేశారు. అనంతరం చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. 'పోనీ పోనీ ఈ ప్రాణమే.. కళకై జరిగే ఓ త్యాగమే' అంటూ లలిత కావ్య ఆలపించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉంది. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌ కామరాజ్‌, శుభలేఖ సుధాకర్‌, భానుప్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్‌ 22న ఈ సినిమా విడుదల కానుంది.

ఇదీ చూడండి: 'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'

ABOUT THE AUTHOR

...view details