అక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన కొత్త చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor movie release date) రాకకు సిద్ధమైంది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. అక్టోబర్ 8న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ సందర్భంగా అఖిల్‌కు సంబంధించిన డిఫరెంట్ లుక్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో జోడించి పోస్టర్‌ను పోస్ట్ చేసింది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రిలీజ్ డేట్ ఫిక్స్ - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్
అఖిల్ అక్కినేని కొత్త సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor movie release date) విడుదల తేదీ ఖరారైంది. దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిందీ చిత్రం. ఈ మూవీ గతేడాదే విడుదల కావాల్సినా, కరోనా లాక్డౌన్ వల్ల అది కాస్తా వాయిదా పడింది. ఇటీవల టాలీవుడ్లో కొత్త చిత్రాల విడుదల తేదీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో దీని రిలీజ్‌పైనా స్పష్టతనిచ్చారు. అఖిల్ సరసన పూజాహెగ్డే నటించారు. గోపీసుందర్ స్వరాలు అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇదీ చూడండి:Radhika Apte Birthday: నటనలో మేటి.. వివాదాలతో పోటీ!