అఖిల్(akhil movies) హీరోగా నటించిన రొమాంటిక్ ఫీల్‌గుడ్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor naa songs). పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అఖిల్(akhil new song) కెరీర్‌లో మొదటి రూ.50 కోట్ల సినిమా ఇదే కావటం విశేషం.
పెళ్లి తర్వాత జీవితం అందంగా ఉండాలంటే రొమాన్స్ ఉండాలి.. ఆ రొమాన్స్ ఉంటేనే ప్రేమ, పెళ్లి రెండు నిలబడతాయి అనే కాన్సెప్ట్‌తో బొమ్మరిల్లు భాస్కర్(bommarillu bhaskar new movie) ఈ సినిమా తెరకెక్కించారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకు కూడా ఈ చిత్రం ఎంతో బాగా నచ్చింది.