'మిస్టర్ మజ్ను' తర్వాత అక్కినేని అఖిల్ కొత్త సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ చిత్రానికి కథానాయిక ఎవరన్న విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఓ ప్రత్యేక ఫొటోను షేర్ చేసింది.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వాసు వర్మ, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినిమాను సమర్పించనున్నారు. గోపీ సుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు.