'అయ్యగారు'(ayyagaru meme).. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండేవారికి ఈ మీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని కుటుంబానికి చెందిన ఓ ఫ్యాన్ వాడిన పదం ఇది(most eligible bachelor movie). అఖిల్‌ను ఉద్దేశిస్తూ ఆయన సినిమాలు విడుదలైనప్పుడల్లా 'అయ్యగారే నెం.1', 'అయ్యగారే కరెక్ట్' అంటూ డైలాగ్‌లు చెబుతూ నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఎలాంటి మీమ్స్ ట్రోల్స్ అయినా అతని డైలాగ్‌ను ఏదో ఒక విధంగా వాడుతూనే ఉంటారు.
ఇటీవల 'మోస్ట్ఎలిజిబుల్ బ్యాచిలర్'(most eligible bachelor movie trailer) సినిమాతో వచ్చి హిట్ కొట్టారు అఖిల్. ఈ చిత్రం రిలీజ్ రోజు కూడా 'అయ్యగారు' ఫ్యాన్ కొబ్బరికొట్టి రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించారు అఖిల్. అతడిని ప్రశంసిస్తూ త్వరలోనే కలుస్తానని చెప్పారు.
"నా కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారాయన. ఆయన వీడియోలు చాలా చూశాను. ఈ పదం నా లైఫ్‌ను టేక్ ఓవర్ చేసింది. నా సినిమాలో కూడా వాడటం జరిగింది. నా ఫ్యాన్ ఇంత పాపులర్ అవ్వడం చాలా విశేషం. ఆయన కలవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీరు ఇదే ఎనర్జీతో ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను."