తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అఖిల్​ 'ఏజెంట్​' రిలీజ్​ డేట్​.. పునీత్​ 'జేమ్స్'​ కొత్త సాంగ్​ - ఎఫ్​ఐఆర్​

Akhil Agent Movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్'​, దివంగత కన్నడ పవర్​స్టార్ పునీత్​రాజ్​కుమార్​ నటించిన 'జేమ్స్'​ సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

akhil akkineni
james puneeth rajkumar

By

Published : Mar 11, 2022, 5:32 PM IST

Akhil Agent Movie: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం 'ఏజెంట్'. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 12న 'ఏజెంట్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.

'ఏజెంట్'లో అఖిల్

ఈ సందర్భంగా గన్​తో అఖిల్ యాక్షన్ సీన్​లో ఉన్న పోస్టర్​ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. 'ఏజెంట్' పోస్టర్​తో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

'జేమ్స్'​ పాట..

దివంగత కన్నడ సూపర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ నటించిన చివరి చిత్రం 'జేమ్స్​'. ఈ చిత్రంలోని సలామ్​ సోల్జర్​ అనే లిరికల్​ సాంగ్​ను విడుదల చేశారు మేకర్స్​.

పునీత్​ జయంతి సందర్భంగా మార్చి 17న దేశవ్యాప్తంగా 4,000 థియేటర్లలో 'జేమ్స్​' విడుదల కానుంది. ఈ సినిమాలో పునీత్​ ఓ సెక్యూరిటీ కంపెనీలో మేనేజర్​ పాత్రలో నటిస్తున్నారు. ఆయన​ సరసన ప్రియా ఆనంద్​ నటించింది. ఈ చిత్రానికి చేతన్​ కుమార్​ దర్శకత్వం వహిస్తుండగా.. కిషోర్​ పత్తికొండ నిర్మిస్తున్నారు.

'మిషన్ ఇంపాజిబుల్' హంగామా..

'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. తాప్సీ ప్రధాన పాత్రలో హర్ష, భాను ప్రకాశ్, జయతీర్థ బాలనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలనుంది. ఈ సందర్భంగా వినూత్నంగా 'మిషన్ ఇంపాజిబుల్' ప్రచారాన్ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్... ట్రైలర్ విడుదల కోసం హంగామా మొదలుపెట్టింది.

వైవా హర్షా ఆధ్వర్యంలో యువ దర్శకులు వినోద్, వివేక్ ఆత్రేయ, భరత్ కమ్మ, తరుణ్ భాస్కర్, సందీప్ రాజ్, ప్రశాంత్ వర్మలతో బాలనటులు చేసిన సందడి నవ్వులు పూయిస్తోంది. మార్చి 14న 'మిషన్ ఇంపాజిబుల్' ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ నిర్ణయించింది.

ఓటీటీలో 'ఎఫ్‌.ఐ.ఆర్‌'

'ఎఫ్‌.ఐ.ఆర్‌'

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ, ఆయన స్వయంగా నిర్మించిన డార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ఎఫ్‌.ఐ.ఆర్‌'. మను ఆనంద్‌ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఉగ్రవాదం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దారు. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మార్చి 12వ తేదీ నుంచి 'ఎఫ్‌.ఐ.ఆర్‌'ను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

ఆది సాయికుమార్​ కొత్త సినిమాలో హీరోయిన్​గా దిగంగన సూర్యవంశీ

ఇదీ చూడండి:రాధేశ్యామ్​ పబ్లిక్ టాక్​: 'ఓ మంచి ప్రయత్నం.. కానీ...'

ABOUT THE AUTHOR

...view details