*నందమూరి బాలకృష్ణ 'అఖండ' ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ప్రస్తుతం 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది.
ఇందులో బాలయ్య అఘోరాగా విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు.
*సందీప్ కిషన్-విజయ్ సేతుపతి నటిస్తున్న మల్టీస్టారర్ 'మైఖేల్'. ఇందులోని ప్రతినాయకుడిగా నటుడు-దర్శకుడు గౌతమ్ మేనన్ నటిస్తున్నారని సోమవారం వెల్లడించారు. సంకెళ్లు, రక్తంతో ఉన్న చేతికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో దీనిని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
*సీనియర్ నటుడు రాజశేఖర్ కొత్త సినిమా 'శేఖర్'. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం(నవంబరు 25) రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. మలయాళ సినిమా 'జోసెఫ్'కు ఇది రీమేక్! అను సితార, మస్కన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తుండగా, జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చిత్రబృందం భావిస్తోంది.
*సంపూర్ణేశ్‌బాబు 'క్యాలీఫ్లవర్' సినిమాలోని 'జుమ్ జుమ్' అంటూ సాగే లిరికల్ గీతం విడుదలైంది. ఇందులో సంపూ సరసన వాసంతి హీరోయిన్గా చేసింది. నవంబరు 26న థియేటర్లలోకి రానుంది.
*నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'బ్రో'. ఈ సినిమాలోని 'ఊహల్లో..' లిరికల్ సాంగ్‌ను సోమవారం రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర ఈ గీతానికి సంగీతమందించారు.
కార్తికే తుపరని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.