తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Akhanda movie: 'అఖండ' సక్సెస్​ మీట్​కు ఎన్టీఆర్, మహేశ్​బాబు! - అఖండ రివ్యూ

Akhanda success meet: థియేటర్లలో అభిమానుల్ని తెగ అలరిస్తున్న 'అఖండ' సినిమా సక్సెస్ మీట్ త్వరలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు మహేశ్​, ఎన్టీఆర్ విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.

akhanda success meet
అఖండ సినిమాలో బాలయ్య

By

Published : Dec 5, 2021, 3:06 PM IST

బాలయ్య అభిమానులకు ఫీస్ట్ అనిపించే వార్త. ప్రేక్షకుల్ని ముఖ్యంగా మాస్ ఆడియెన్స్​ను తెగ అలరిస్తున్న 'అఖండ' సినిమా.. డిసెంబరు 8న సక్సెస్​ మీట్ జరుపుకోనుంది. అయితే ఈ ఈవెంట్​కు సూపర్​స్టార్ మహేశ్​బాబు, ఎన్టీఆర్​ ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. దీంతో అభిమానులు అప్పుడే పండగ చేసుకుంటున్నారు.

మహేశ్​బాబు ఎన్టీఆర్

మాస్, క్లాస్​ అనే తేడా లేకుండా బాలయ్య.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. 'అఖండ'గా వెండితెరపై విశ్వరూపం చూపిస్తున్నారు. కరోనా సెకండ్​ వేవ్ తర్వాత వచ్చిన స్టార్ హీరో సినిమా ఇదే! దీంతో సినీ అభిమానులు చాలామంది థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

మరోవైపు బాలయ్య హోస్ట్​గా చేస్తున్న 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' షోలో పాల్గొనట్లు సూపర్​స్టార్ మహేశ్​బాబు వెల్లడించారు. బాలకృష్ణతో తీసుకున్న ఫొటోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ చేశారు.

బాలయ్య టాక్​ షోలో మహేశ్​బాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details