తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అఖండ' టైటిల్ సాంగ్ టీజర్​ అదిరింది! - బాలకృష్ణ అఖండ టైటిల్ సాంగ్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను(balayya boyapati movies) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అఖండ'. తాజాగా దీపావళి పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ సాంగ్ టీజర్(akhanda title song)​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ నెల 8న పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు.

Akhanda
అఖండ

By

Published : Nov 4, 2021, 11:48 AM IST

నందమూరి బాలకృష్ణ 'అఖండ'(akhanda release date) నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ టీజర్​(akhanda title song)ను రిలీజ్ చేశారు. పూర్తి పాటను ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలయ్య(balayya movies).. డిఫరెంట్ గెటప్స్​లో కనిపించనున్నారు.

బాలయ్య-బోయపాటి(balayya boyapati movies) కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు 'సింహా', 'లెజెండ్​' చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో బాలకృష్ణ(balakrishna dialogues) సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్(thaman songs) సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇవీ చూడండి: టాలీవుడ్​ దీపావళి.. కొత్త అప్​డేట్స్​తో సందడి

ABOUT THE AUTHOR

...view details