తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అఖండ' రిలీజ్​కు రెడీ.. 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్ సాంగ్ - cinema news

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అఖండ, రాధేశ్యామ్, పుష్పక విమానం, జెర్సీ, భీమ్లా నాయక్, బంగార్రాజు సినిమాల కొత్త సంగతులు ఉన్నాయి.

akhanda radhe shyam
అఖండ రాధేశ్యామ్

By

Published : Dec 1, 2021, 2:02 PM IST

*Akhanda release: నందమూరి బాలకృష్ణ 'అఖండ' విడుదలకు సిద్ధమైంది. గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్​ను రిలీజ్ చేశారు. బాలయ్య లుక్​ కేక పుట్టిస్తోంది!

అఖండ మూవీ కొత్త పోస్టర్

సింహా, లెజెండ్​ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్​లో వస్తున్న చిత్రం కావడం వల్ల అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

*Radhe shyam song: ప్రభాస్-పూజా హెగ్డే 'రాధేశ్యామ్' రెండో సాంగ్.. హిందీ వెర్షన్​ రిలీజైంది. 'ఆషికీ ఆగయి' అంటూ సాగుతున్న లిరిక్స్​ దానికి తోడు విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో సినిమా కథ కూడా కొంతమేర చెప్పినట్లు తెలుస్తోంది. పాట చివరి 30 సెకన్లలో దానిని చూపించారు! మీరు ఓ లుక్కేయండి.

1970ల నాటి ప్రేమకథతో తీస్తున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ, జయరాజ్, ప్రియదర్శి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.

*Pushpaka vimanam OTT: మరో కొత్త సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ ఖరారు చేసుకుంది. ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం'.. డిసెంబరు 10 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించారు.

పుష్పక విమానం మూవీ ఓటీటీ

పెళ్లికూతురు కనిపించకుండా పోవడం నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. గీత్ సైనీ, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించారు. దామోదర దర్శకత్వం వహించారు. ఇందులో సునీల్, నరేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

*షాహిద్ కపూర్ 'జెర్సీ' సినిమా కొత్త పోస్టర్​ రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' రీమేక్​గా దీనిని తెరకెక్కించారు. ఇందులో మృనాల్ ఠాకుర్ హీరోయిన్​గా నటించింది. ఒరిజినల్​ తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

జెర్సీ హిందీ మూవీ పోస్టర్

*సిరివెన్నెల మరణంతో.. బుధవారం రిలీజ్ కావాల్సిన 'భీమ్లా నాయక్' సినిమాలోని 'అడవి తల్లి' పాట, 'బంగార్రాజు'లోని 'బంగార్రాజు నాకోసం' సాంగ్​ టీజర్​ రిలీజ్​ను వాయిదా వేస్తున్నట్లు సదరు చిత్రబృందాలు ప్రకటించాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details