తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Akhanda movie updates: బాలయ్య 'అఖండ' విడుదల అప్పుడేనా! - అఖండ రిలీజ్ డేట్

బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) 'అఖండ'(Akhanda Release Date) కోసం అభిమానులు మరికొన్నాళ్లు ఎదురుచూడాలి ఏమో! దసరాకు వస్తుందని అనుకున్న ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Akhanda
అఖండ

By

Published : Sep 27, 2021, 9:41 AM IST

నందమూరి బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తీస్తున్న చిత్రం 'అఖండ'(Akhanda Release Date). అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. 'అఖండ'(Akhanda Movie Updates) దసరాకు కాకుండా సంక్రాంతికి విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే త్వరలో ఓ పోస్టర్​ను కూడా రిలీజ్ చేయనున్నారట.

సంక్రాంతి బరిలో..

సంక్రాంతి బరిలో ఇప్పటికే పవర్​స్టార్ పవన్​కల్యాణ్ 'భీమ్లా నాయక్​', సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట', యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్ ' రాధేశ్యామ్​' సిద్ధమయ్యాయి. ఈ చిత్రాలు వరుసగా జనవరి 12, 13, 14 తేదీల్లో విడుదలకు థియేటర్లలోకి రానున్నాయి. ఒకవేళ 'అఖండ'(Akhanda Release Date) రిలీజ్​ కూడా అప్పుడే అయితే ఏ రోజున విడుదలవుతుందో​ చూడాలి. ఈ నెలాఖరు నాటికి అఖండ(Akhanda Movie Updates) షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. పూర్ణ, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం పాట చిత్రీకరణ కోసం గోవా వెళ్లింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:Akhanda: బాలయ్య జోరు.. 'అఖండ' డబ్బింగ్​ షురూ..

ABOUT THE AUTHOR

...view details