తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య 'అఖండ' సినిమాకు తొలిరోజు భారీ వసూళ్లు - akhanda film review

Akhanda collection day 1: బాలయ్య 'అఖండ' గర్జన అదిరిపోయింది. బాక్సాఫీసు దగ్గర సినిమా దుమ్మురేపుతోంది. దీంతో తొలిరోజు భారీస్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

akhanda movie
బాలయ్య అఖండ

By

Published : Dec 3, 2021, 1:14 PM IST

Akhanda collection Today: అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్​ దగ్గర మరోసారి తన స్టామినా చూపించారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బాక్స్ బద్దలుకొట్టారు. 'అఖండ'గా గర్జించి, తొలిరోజే దాదాపు రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేశారు! బాలయ్య సినీ కెరీర్​లో​ తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. దీని బట్టే బాలయ్య సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది.

ఏపీలో ఓవైపు టికెట్ ధరలు తగ్గించడం, మరోవైపు బెన్​ఫిట్​ షోలు లేకపోవడం.. వీటికి తోడు కరోనా కొత్త వేరియెంట్​ ఒమిక్రాన్ భయం.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్​ దగ్గర బాలయ్య మాస్ ర్యాంపేజ్​ను అవేవి అస్సలు నిలువరించలేకపోయాయి. నటసింహం సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాయి. దీంతో అభిమానులు థియేటర్ల దగ్గర, సోషల్ మీడియాలో తెగ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి ముందే వచ్చేసిందని సంబరపడుతున్నారు.

బాలయ్య అఖండ మూవీ

సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. దానికి తోడు తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అయితే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. 'జై బాలయ్య' పాటకైతే థియేటర్​లో ఒక్కరంటే ఒక్కరు కూడా సీట్​లో కూర్చోకుండా నిలబడి గెంతుతూనే ఉన్నారు! సోషల్ మీడియాలో వైరల్​గా మారిన చాలా వీడియోలే అందుకు ఉదాహరణలు.

ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్​బస్టర్​ కొట్టారు. తమ కాంబోకు తిరుగులేదని నిరూపించారు. 'అఖండ'లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా చేసింది. శ్రీకాంత్ విలన్​గా చేశారు. జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details