Akhanda Collections till date: నందమూరి నటసింహం బాలకృష్ణ సెంచరీ కొట్టారు. సెంచరీ కొట్టడమేంటి అనుకుంటున్నారా? విషయమేమిటంటే.. ఆయన నటించిన తాజా చిత్రం 'అఖండ' థియేటర్లు దద్దరిల్లేలా గర్జిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసిందని తెలిసింది. అలాగే రూ.61.5కోట్ల షేర్‌ను దాటిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
అంతకుముందు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లు వసూళ్లు చేయగా..ఈ చిత్రంతో కెరీర్లో తొలిసారి రూ.100కోట్ల గ్రాస్‌ను అందుకున్నారు బాలయ్య! ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.53కోట్లు జరిగినట్లు సమాచారం.
ఓవర్సీస్లోనూ దూకుడు