Akhanda first day collection worldwide: అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చాటారు. స్వదేశంలోనే కాదూ.. ఓవర్సిస్లోనూ దుమ్మురేపింది 'అఖండ'. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తొలిరోజే భారీ వసూళ్లు చేసింది.
- అమెరికాలో రూ.3.21 కోట్లు
- కెనడాలో రూ.12.99 లక్షలు
- యూకేలో రూ.32.58 లక్షలు
- ఆస్ట్రేలియాలో రూ. 52.15 లక్షలు
భారత్లో 'అఖండ'గా గర్జించి, తొలిరోజే దాదాపు రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేశారు బాలయ్య. సినీ కెరీర్లో తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. దీని బట్టే బాలయ్య సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది.