ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుల్లో సూర్య ఒకరు. పాత్ర సహజత్వం కోసం ఎంతగానో శ్రమిస్తాడు. ఒకే సినిమాలో మూడు నాలుగు గెటప్పులకు తగ్గట్టు తనని తాను మలుచుకుంటాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలోనూ విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సూర్య ఎంత కష్టపడుతున్నాడో తెలియజేసే ఓ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.
44 ఏళ్ల సూర్య 19 ఏళ్ల వ్యక్తిగా ఎలా మారాడంటే! - surya stuns as 19 year old boy
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సూర్య 19 ఏళ్ల వ్యక్తిగా మారడం కోసం పడిన కష్టాన్ని చూపించారు.

సూర్య
'ఫ్రం స్క్రిప్ట్ టు స్క్రీన్' పేరుతో మేకింగ్ వీడియో రూపొందించారు. ఇందులో దర్శకురాలు సూర్యను ఎలా చూపించాలనుకున్నారో చిత్రబృందంతో మాట్లాడుతుండగా.. సూర్య చేస్తోన్న కసరత్తులు దర్శనమిస్తాయి. సూర్య రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆ వీడియో మీరూ చూడండి.