తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆకాశ్ పూరీ భలే రొమాంటిక్ - ఛార్మి

పూరీ ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్' అనే సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది.

పూరి ఆకాశ్

By

Published : Feb 11, 2019, 12:13 PM IST

Updated : Feb 11, 2019, 12:40 PM IST

మాస్, క్లాస్ చిత్రాలు తీయడంలో దర్శకుడు పూరి జగన్నాధ్ సిద్ధహస్తుడు. ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలే అందుకు ఉదాహరణ. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రస్తుతం పూరి చేతిలో ఉంది.

ఆయన కుమారుడు హీరోగా మరో సినిమాను మొదలు పెట్టేశాడు పూరి. కాకపోతే దర్శకత్వం తప్ప అన్ని బాధ్యతలు పూరీయే చూసుకుంటున్నాడు. ఈ సినిమాతో అనిల్ పాదూరిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.

కుమారుడు హీరోగా ఇప్పటికే మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించాడు పూరి. ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ మాత్రం దక్కలేదు. ఈ చిత్రంతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.

Last Updated : Feb 11, 2019, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details