టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆకాశ్, తన స్నేహితుడు, నటుడు రాహుల్ విజయ్‌తో కలిసి ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించాడు. పూరీ దర్శకత్వం వహించిన బుజ్జిగాడు, బద్రి, శివమణి, పోకిరి, దేశముదురు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్, పైసా వసూల్.. ఇలా పలు సినిమాల్లోని డైలాగ్‌లకు వీరిద్దరూ నటించి మెప్పించారు. ఈ వీడియోను ఆకాశ్.. "మాకు సినిమా అంటే ప్రేమ. పూరీ జగన్నాథ్ అంటే ఇంకా చాలా ఇష్టం." అంటూ పోస్ట్ చేశాడు.
పూరీ సినిమా డైలాగ్‌లతో ఆకట్టుకున్న ఆకాశ్, రాహుల్ - రాహుల్ విజయ్ తాజా వార్తలు
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ తాజాగా ఓ వీడియోను నెట్టింట షేర్ చేశాడు. ఇందులో తన స్నేహితుడు, నటుడు రాహుల్ విజయ్‌తో కలిసి పూరీ సినిమాల్లోని డైలాగ్‌లకు నటించి మెప్పించాడు.
![పూరీ సినిమా డైలాగ్‌లతో ఆకట్టుకున్న ఆకాశ్, రాహుల్ ఆకాశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7244009-thumbnail-3x2-aka.jpg)
ఆకాశ్ షేర్ చేసిన వీడియోకు సినీ ప్రియుల నుంచే కాకుండా పలువురు సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. "సూపర్ అబ్బాయిలు.. ఇద్దరూ చించేశారు" అని అనిల్ రావిపూడి రిప్లై ఇవ్వగా ఆకాశ్ స్పందించాడు. "థ్యాంక్యూ సో మచ్ సర్.!! కానీ ఒక్క ఛాన్స్ సర్ (నవ్వుతున్న ఎమోజీ) ప్లీజ్ గుర్తుపెట్టుకోండి" అని ఆకాశ్ కామెంట్ పెట్టాడు. పూరీ కూడా తనయుడి నటన చూసి మురిసిపోయారు. "సూపర్.. లవ్ యూ" అని రిప్లై ఇచ్చారు.
'మెహబూబా' చిత్రంతో ఆకాశ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. ప్రస్తుతం ఆకాశ్ 'రొమాంటిక్' చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కేతికా శర్మ కథానాయిక.