బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్... ఏదైనా సినిమా కొత్తగా కనిపిస్తే చాలు ఇట్టే పట్టేస్తాడు. అలా దక్షిణాది చిత్రాలను తనదైన శైలిలో రీమేక్ చేసి మెప్పిస్తుంటాడు. ఇప్పుడు ఓ కన్నడ సినిమాను హిందీలో తెరకెక్కించనున్నాడని సమాచారం.
అక్షయ్..ప్రస్తుతం 'కాంచన' రీమేక్ 'లక్ష్మీబాంబ్'లో నటిస్తున్నాడు. ఇప్పుడు 'బెల్ బాటమ్' అనే కన్నడ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు.