ప్రముఖ నిర్మాణసంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించబోతోంది. రచయిత మధు బాబు రాసిన నవల ఆధారంగా 'షాడో' అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించనున్నట్లు ఇటీవలే ప్రకటన చేసింది.
'షాడో' వెబ్‌సిరీస్‌లో రానా, అల్లరి నరేశ్! - AK entretainments
టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టబోతోంది. మధు బాబు రచించిన నవల ఆధారంగా 'షాడో' వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది . ఇందులో నటించడానికి ప్రముఖ టాలీవుడ్ నటులు రానా, అల్లరి నరేశ్‌లను సంప్రదించినట్లు సమాచారం.
'షాడో' వెబ్‌సిరీస్‌లో రానా, అల్లరి నరేశ్!
ఈ వెబ్‌సిరీస్‌లో రెండు కీలక పాత్రల కోసం అల్లరి నరేశ్, రానా దగ్గుపాటిలను నిర్మాణ సంస్థ సంప్రదించిందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి వారిద్దరూ అంగీకరిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.