తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటిస్తున్న చిత్రం 'వాలీమై'. హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో అజిత్.. ఈశ్వరమూర్తి అనే ఐపీఎస్ అధికారిగా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్న అజిత్ - అజిత్ పోలీస్
తమిళ స్టార్ హీరో అజిత్.. పోలీస్ పాత్రలో మరోసారి దర్శనమివ్వనున్నారు. 'వాలీమై' సినిమాలో ఐపీఎస్ అధికారిగా విలన్ల భరతం పట్టనున్నారు.
విలన్ల వేటలో ఈశ్వరమూర్తి ఐపీఎస్!
రేసుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ, హ్యూమకురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి యవన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చూడండి:తిరిగి సెట్లో అడుగుపెట్టిన 'నారప్ప'