Ajith Valimai: తమిళ సూపర్‌స్టార్ అజిత్ నటించిన 'వలిమై' మేకర్స్‌పై గుర్రుగా ఉన్నాడట స్టార్ కమెడియన్ యోగి బాబు. అజిత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఫిబ్రవరి 24న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తమిళంలో సూపర్‌హిట్ అనిపించుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందనను అందుకుంది.
అయితే ఈ సినిమా చూసిన చాలామందికి తెలియని విషయమేమిటంటే ఇందులో ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు కూడా ఓ పాత్ర చేశాడని. కాకపోతే ఆయన సన్నివేశాలన్నింటినీ తొలగించారు. ఇప్పుడు ఇదే విషయమై యోగి బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. 'వలిమై' డైరెక్టర్, హీరో అజిత్ దగ్గర తన అసహనాన్ని వెలిబుచ్చాడని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.