తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి రేసులో అజిత్ 'వాలిమై' - అజిత్​ వాలిమై రిలీజ్​ డేట్​

Valimai Release date: తమిళ స్టార్​ హీరో అజిత్​ నటించిన 'వాలిమై' సినిమా విడుదల తేదీ ఫిక్స్​ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

Ajith Valimai Released on January 13
సంక్రాంతి కానుకగా 'అజిత్'​ వాలిమై

By

Published : Jan 4, 2022, 1:02 PM IST

Valimai Release date: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వాలిమై' రిలీజ్​ డేట్​ ఖరారైపోయింది. తమిళ స్టార్​ అజిత్​ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలిపింది చిత్రబృందం.

ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా నటించగా, తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్​గా అలరించనున్నారు. ఈ మూవీకి హెచ్​ వినోద్​ దర్శకత్వం వహించగా.. హ్యుమా ఖురేషి, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మించారు.

ఇదీ చూడండి: రాయ్​ లక్ష్మీ కిల్లింగ్​ లుక్స్​.. నిధి, అను పరువాల విందు

ABOUT THE AUTHOR

...view details