తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజ్​తరుణ్​ కోసం చరణ్​.. సంక్రాంతికి 'వాలిమై' - vikram mahan movie

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో తమిళ హీరోలు అజిత్​, శివ కార్తికేయన్​, విక్రమ్​.. టాలీవుడ్ యువ కథానాయకులు రాజ్​ తరుణ్​, నాగశౌర్య, శర్వానంద్​, సిద్దార్థ్‌ చిత్రాల వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Sep 22, 2021, 8:28 PM IST

Updated : Sep 22, 2021, 8:39 PM IST

యువ నటుడు రాజ్​తరుణ్​ నటిస్తున్న కొత్త సినిమా​ 'అనుభవించు రాజా'(anubhavinchu raja raj tarun movie). ఈ చిత్ర టీజర్​ను సెప్టెంబరు 23 ఉదయం 10.08గంటలకు మెగాపవర్​ స్టార్​ రామ్​ చరణ్(rrr ram charan movie)​ రిలీజ్​ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్​, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్​పీ​ ఈ మూవీని నిర్మించనున్నాయి. గావిరెడ్డి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అనుభవించు రాజా

సాంగ్​ రిలీజ్​

నాగశౌర్య, రీతూవర్మ(naga shaurya ritu varma) నటిస్తున్న 'వరుడు కావలెను'(varudu kaavalenu movie director) సినిమాలోని 'మనసులోనే నిలిచిపోకే' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా, సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు.

వాలిమై

హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'వాలిమై'(ajith new movie release date). తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపింది చిత్రబృందం. అజిత్‌కు(ajith kumar valimai release date) జోడీ హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వాలిమై

మహాసముద్రం

శర్వానంద్‌, సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మహాసముద్రం'(mahasamudram trailer). ఈ చిత్ర థియేట్రికల్​ ట్రైలర్​ను సెప్టెంబరు 23న (mahasamudram release date) సాయంత్రం 6.03 గంటల​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు.

మహాసముద్రం

రిలీజ్​ డేట్​

తమిళ హీరో శివకార్తికేయన్(siva karthikeyan movie list)​ నటించిన 'వరుణ్​ డాక్టర్'​(varun doctor movie) మోషన్​ టీజర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్​ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రబృందం.

ఫస్ట్​ సింగిల్​

కోలీవుడ్​ హీరో విక్రమ్​ నటిస్తున్న కొత్త సినిమా 'మహాన్'​లోని ఫస్ట్​ సింగిల్​ రిలీజ్​ అయింది. ఇందులో విక్రమ్ లుక్​ అదిరిపోయింది.

అలాంటి సిత్రాలు
సనక్​

ఇదీ చూడండి: ఈ రోజు నేను అస్సలు మర్చిపోలేను: చిరంజీవి

Last Updated : Sep 22, 2021, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details