అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వాలిమై'. తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి అజిత్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇందులో అజిత్ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.
అజిత్‌కు జోడీ హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.