తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వలిమై' రిలీజ్​ డేట్ ఖరారు​.. షూటింగ్​లో అలియా భట్​ - వలిమై

Ajith Kumar Valimai Release Date: తమిళ సూపర్​స్టార్​ అజిత్​ కుమార్​ నటించిన 'వలిమై' రిలీజ్​ డేట్​ను ఖరారు చేశారు మేకర్స్. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన బాలీవుడ్​ భామ అలియా కొత్త సినిమా షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది.

alia bhatt ranveer singh movie
valimai release date

By

Published : Feb 2, 2022, 7:28 AM IST

Updated : Feb 2, 2022, 11:06 AM IST

Ajith Kumar Valimai Release Date: ఎట్టకేలకు తమిళ సూపర్​స్టార్​ అజిత్ కుమార్​ నటించిన 'వలిమై' విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం . కరోనా పరిస్థితుల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఫబ్రవరి 24న రిలీజ్​ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

ఫిబ్రవరి 24న 'వలిమై' విడుదల

హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను బోనీ కపూర్‌ నిర్మించారు. హ్యూమా ఖురేషి కథానాయిక. కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు.

హ్యూమా ఖురేషి

ఈ సినిమాలో అజిత్‌ సీబీసీఐడీ అధికారిగా సందడి చేయనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసే యోచనలో చిత్రబృందముంది.

షూటింగ్​లో అలియా, రణ్​వీర్​..

కరోనా మూడోవేవ్‌ ప్రభావంతో బాలీవుడ్‌ స్తంభించిపోయింది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల మళ్లీ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆయా చిత్రబృందాలు. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ'. రణ్‌వీర్‌సింగ్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ జనవరి తొలివారంలో ఆగిపోయింది. తిరిగి బుధవారం నుంచి చిత్రీకరణ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 12 రోజుల ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అలియా భట్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:రవితేజ, సూర్య కొత్త సినిమాల రిలీజ్ డేట్స్​

Last Updated : Feb 2, 2022, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details