కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో రాష్ట్రాలన్నీ దాదాపు లాక్డౌన్లో పాటిస్తున్నాయి. ఏడాది కాలంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఈ వైరస్ మూలంగా ప్రజలు రోజూ చనిపోతున్నారు. వారిని ఆదుకోవడంలో భాగంగా పలువురు సినీ కథానాయకులు తమ వంతు సాయం అందజేస్తున్నారు. ఇందులో భాగంగా హీరో సూర్య కుటుంబం, తమిళనాడు ప్రభుత్వానికి రూ.కోటి ఇవ్వగా, ఇప్పుడు తలా అజిత్ రూ.25 లక్షలు విరాళమిచ్చారు.
కరోనా బాధితుల కోసం హీరో అజిత్ భారీ సాయం - ajith vijay news
అగ్రహీరో అజిత్ కుమార్.. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. రూ.25 లక్షల చెక్కును స్టాలిన్‌కు అందజేశారు.
అజిత్
అజిత్ ప్రస్తుతం వాలిమై సినిమా చేస్తున్నారు. ఇందులో యువ నటుడు కార్తికేయ, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.