బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తండ్రి వీరూ దేవగణ్ సోమవారం ఉదయం కన్ను మూశారు. 80కు పైగా హిందీ చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలు సమకూర్చారు వీరూ. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
అగ్ర కథానాయకుడి తండ్రి కన్నుమూత - హీరో అజయ్ దేవ్‌గణ్
బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగణ్.. సోమవారం ఉదయం ముంబయిలో మృతి చెందారు. సామాజిక మాధ్యమాల్లో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
హీరో అజయ్ దేవగణ్ తండ్రి మృతి
కుమారుడు అజయ్ హీరోగా 'హిందూస్థాన్ కీ కసమ్' అనే సినిమాకు దర్శకత్వం వహించారు వీరూ దేవగణ్. అందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. టోటల్ ధమాల్ ప్రీమియర్‌కు హాజరైన వీరు... ఆ తర్వాత బయట పెద్దగా కనిపించలేదు.