బాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్- అజయ్ దేవగణ్‌ల కాంబో కూడా అందులో ఒకటి. తాజాగా వీరి కలయికలో ఓ సినిమా తెరకెక్కడానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ చిత్రానికి అజయ్ దర్శకత్వం వహించనుండటం విశేషం.
అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్ - అమితాబ్ మేడే
హీరో అజయ్ దేవగణ్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ నటించనున్నారు. 'మేడే' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
అమితాబ్‌ను డైరెక్ట్ చేయనున్న అజయ్ దేవగణ్
''మేడే' టైటిల్‌తో అమితాబ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అజయ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే మిగిలిన వివరాలు తెలియనున్నాయి" అని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ప్రకటించారు.