జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత వీరులు అమరులైన ఘటన యావత్తు దేశాన్ని కలిచివేసింది. అయితే తాజాగా ఇదే కథాంశం నేపథ్యంలో త్వరలోనే బాలీవుడ్లో సినిమా తెరకెక్కనుంది. స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అజయ్ దేవగణ్ ఎఫ్‌ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్ ఎల్ఎల్పీ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
"మొక్కవోని ధైర్యసాహసాలతో చైనీయులను వెనక్కు తరిమికొట్టిన మన భారత సైన్యంలోని అమరులైన 20మంది జవాన్ల త్యాగాలు, వీరత్వం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం."
-అజయ్ దేవగణ్ ఎఫ్ ఫిల్మ్స్.