బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్(Ajay Devgan), సంజయ్ దత్(Sanjay Dutt) ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'(Bhuj: The Pride of India). 1971లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంతో సినిమాను రూపొందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు చోట్ల థియేటర్లు ఇంకా తెరచుకోకపోవడం వల్ల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఆగస్టు 13న డిస్నీ+హాట్‌స్టార్‌లో చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Ajay Devgan: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'భుజ్' - ఆగస్టు 13న భుజ్ విడుదల
1971లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంతో రూపొందిన చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'(Bhuj: The Pride of India). అజయ్ దేవగణ్(Ajay Devgan), సంజయ్ దత్(Sanjay Dutt) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
Ajay Devgan: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన 'భుజ్'
ఈ సందర్భంగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తున్న వీడియోను సోషల్‌మీడియాలో చిత్రబృందం షేర్ చేసింది. ఇందులో అజయ్ దేవగణ్, సంజయ్ దత్‌లతో పాటు సోనాక్షి సిన్హా(Sonakshi Sinha), అమ్మీ విర్క్(Ammy Virk), శారద్ ఖేల్కర్(Sharad Kelkar), నోరా ఫతేహి(Nora Fatehi), ప్రణితా సుభాష్(Pranitha Subhash) తదితరులు నటించారు. అభిషేక్ దుదియా దర్శకత్వం వహిస్తుండగా.. కథానాయకుడు అజయ్ దేవగణ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి..ఇండో-పాక్ యుద్ధంలో సోనాక్షి.. ఫస్ట్‌లుక్ అదరహో