తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆకట్టుకుంటోన్న 'మైదాన్' కొత్త పోస్టర్ - అజయ్​ దేవ్​గన్​ పుట్​బాల్​

అజయ్​ దేవగణ్​ 'మైదాన్​' సినిమాకు సంబంధించిన మరో లుక్​ విడుదలైంది. పుట్​బాల్​ పట్టుకుని చిన్నారులు మట్టిలో నిల్చొని ఉన్న ఈ లుక్​​ ఆకట్టుకుంటోంది. నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Ajay Devgn shares a glimpse of the footballers who are all set to take on the game
బరిలో దిగేందుకు సిద్ధమైన 'మైదాన్'​

By

Published : Jan 28, 2020, 2:32 PM IST

Updated : Feb 28, 2020, 7:02 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్​ దేవగణ్​​​.. ఇటీవలే 'తానాజీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతూ అలరిస్తోందీ చిత్రం. ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే 'మైదాన్​' చిత్రీకరణలో పాల్గొంటున్నాడీ నటుడు. ఈరోజు సినిమాకు సంబంధించిన టీజర్ పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నాడు అజయ్.

ఇందులో కొంతమంది అబ్బాయిలు.. బురదతో ఉన్న మైదానంలో ఫుట్​బాల్​ పట్టుకుని కనిపించారు. క్రీడాకారుల కాళ్లు మాత్రమే చూపించి, సినిమాపై అంచనాల్ని పెంచేసింది చిత్రబృందం.

బరిలో దిగేందుకు సిద్ధమైన 'మైదాన్'​
'మైదాన్​' ఫుట్​బాల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం. అజయ్​ దేవగణ్​ జాతీయ పుట్​బాల్​ కోచ్ సయ్యద్ అబ్దుల్​ రహీమ్​ పాత్ర పోషిస్తున్నాడు. అబ్దుల్​ రహీమ్​ను భారతీయ ఫుట్​బాల్ పితామహుడు అని కూడా అంటారు. ఈయన కోచ్​తో పాటు 1950 నుంచి 1963 వరకు ఫుట్​బాల్ జట్టుకు మేనేజర్​గానూ వ్యవహరించారు. ఇందులో హీరోయిన్​గా ప్రియమణి నటిస్తోంది. అమిత్​ రవీంద్రనాథ్​ శర్మ దర్శకుడు. బోనీకపూర్​, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చదవండి:'కేజీఎఫ్-2' ముగింపు రామోజీ ఫిల్మ్​సిటీలోనే!​

Last Updated : Feb 28, 2020, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details