దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం). రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ వీరికి గురువు పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బాలీవుడ్ నటుడు స్వాతంత్ర్య సమరయోధుడిగానూ కనువిందు చేయనున్నారు.
ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించి 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్‌కు ముందు రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన 1900ల నాటి సెట్లో అజయ్‌పై 10 రోజులపాటు షూటింగ్ చేశారు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి పనిమొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.