రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పట్ల బాలీవుడ్ నటీనటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి హరిత ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇందులో భాగంగానే నటుడు అజయ్ దేవగణ్.. రామోజీఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అజయ్ దేవగణ్ - అజయ్ దేవ్‌గణ్ మేడే సినిమా
షూటింగ్లో భాగంగా భాగ్యనగరంలో ఉన్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్.. హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. తన ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అజయ్ దేవ్‌గణ్
తన మనసుకు దగ్గరైన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అజయ్. తన ఎన్ వై ఫౌండేషన్ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత మందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
బిగ్‌బీ అమితాబ్ ప్రధాన పాత్రలో 'మేడే' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో నటించడం సహా దర్శకత్వం వహిస్తున్నారు అజయ్ దేవగణ్.
Last Updated : Dec 18, 2020, 3:58 PM IST