బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ పోలీసు పాత్రలో కనిపించి భారీ హిట్ అందుకున్న సినిమా 'సింగం'. 2011లో విడుదలైన ఈ చిత్రం నేటితో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "9 వసంతాల సింగం. ప్రస్తుత పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటూ.. ప్రజలకు అండగా నిలబడుతున్న పోలీసుల ధైర్య సాహసాలను ఈ సినిమా గుర్తు చేస్తుంది." అంటూ పేర్కొన్నాడు.
పోలీసుల ధైర్య సాహసాలకు సెల్యూట్: అజయ్ - ajay devgam movie latest news
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ పోలీసు పాత్రలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా 'సింగం'. నేటితో ఈ చిత్రం విడుదలై 9 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
యాక్షన్ హీరో అజయ్ 'సింగం'కు 9 వసంతాలు
'సింగం' చిత్రంలో అజయ్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. 2010లో తమిళ్ హీరో సూర్య నటించిన సింగం చిత్రానికి ఇది రీమేక్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్గా 'సింగం రిటర్న్స్' పేరుతో 2014లో మరోసారి ప్రేక్షకులను అలరించాడు అజయ్.