బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ నటిస్తున్న చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలకు అజయ్ స్టంట్‌లు కొరియోగ్రాఫ్ చేశారట. లాక్‌డౌన్‌కు ముందు ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని సమాచారం. సంజయ్‌దత్‌కు సంబంధించిన కొన్ని పోరాట సన్నివేశాలకు అజయ్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇవి పాకిస్తాన్ గూఢచారులతో పోరాడే సన్నివేశాలని తెలుస్తోంది.
కొత్త సినిమాకు స్టంట్ మాస్టర్‌గా అజయ్ దేవగణ్ - బాలీవుడ్ సినిమా వార్తలు
తన కొత్త సినిమాలోని కొన్ని సన్నివేశాలకు స్టంట్స్ రూపొందించారు హీరో అజయ్ దేవగణ్. ఫైట్ మాస్టర్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
హీరో అజయ్ దేవగణ్
ఈ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్నిక్ పాత్రలో అజయ్ నటిస్తున్నారు. ప్రతినాయకులుగా సంజయ్‌దత్, శరద్ కేల్కర్ కనిపించనున్నారు. సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి, అమి విర్క్, ప్రణీతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 1971 కాలంనాటి ఇండో-పాక్ యుద్ధ నేపథ్యం కథతో తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ దుదియా దర్శకుడు.
ఇవీ చదవండి: