తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సింగం 3'కి రంగం సిద్ధం.. కథ ఇదేనా? - ajaydevgan upcoming movie

'సింగం' సిరీస్​లో భాగంగా 'సింగం 3'ను తెరకెక్కించేందుకు దర్శకుడు రోహిత్​శెట్టి సన్నాహాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. ఈ సినిమాను 2023 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగానే తేదీ ఖరారు చేసినట్టు సమాచారం.

singham
సింగం

By

Published : Nov 7, 2021, 7:42 AM IST

పోలీస్‌ కథల్ని యాక్షన్‌ ప్రియుల్ని అలరించేలా తీయడంలో రోహిత్‌శెట్టి స్టైలే వేరు. తాజాగా అక్షయ్‌కుమార్‌తో తెరకెక్కించిన 'సూర్యవంశీ' బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ఆయన అజయ్‌దేవగణ్‌తో తీసిన 'సింగం' సిరీస్‌ చిత్రాలు భారీ విజయాల్ని అందుకున్నాయి.

ఇప్పుడు ఈ సిరీస్‌లో 'సింగం 3'కి సన్నాహాలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది. ఈ సినిమాను 2023 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగానే తేదీ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ముందు 'సర్కస్‌' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు రోహిత్‌. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ కపూర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఇదీ చూడండి:Anushka shetty birthday: అనుష్క జీవితాన్ని మార్చిన ఆ రోజు..

ABOUT THE AUTHOR

...view details