తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లిని మించిన కష్టం లేదు :అజయ్‌ దేవగణ్‌ - అజయ్ దేవ్​గణ్

తనదైన శైలి నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ బాలీవుడ్ అగ్రనటుడిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ దేవ్​గణ్. ఆర్​ఆర్​ఆర్​తో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడీ హీరో.

ajay devagan
అజయ్ ఫ్యామిలీ

By

Published : Dec 23, 2019, 6:31 AM IST

బాలీవుడ్ అగ్రనటుడిగా అజయ్ దేవ్​గణ్​కు మంచి పేరుంది. 'ఫూల్‌ ఔర్‌ కాంతే' చిత్రంతో 1991లో తెరంగ్రేటం చేసిన ఈ హీరో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే హవా కొనసాగిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ప్రముఖ నటి కాజోల్‌ను ప్రేమించి పెళ్లాడిన అజయ్ తాజాగా ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో ప్రేమ, సామాజిక మాధ్యమాల గురించిన పలు విషయాలు పంచుకున్నాడు.

సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు బాగా ఇష్టపడేది?

అన్నీ సమానమే. ప్రత్యేకంగా ఇష్టమని చెప్పలేను.

ఎవరు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతుంటారు. మీరా? కాజోలా?

కాజోల్‌

అజయ్ ఫ్యామిలీ

ట్విట్టర్, ఇన్‌స్టా ఖాతాలో అప్‌డేట్స్‌ ఎప్పుడు చూస్తుంటారు?

10-15 రోజులకోసారి కొత్త కబుర్లు ఏమైనా ఉన్నాయా? అని వెతుకుతుంటా.

వాటిలో నెటిజన్లు పెట్టే కామెంట్స్‌ చదువుతారా?

కొన్నిసార్లు

ఏదైనా ఫొటోకి క్యాప్షన్‌ రాయాలంటే మీకు ఎంత సమయం పడుతుంది?

ఒక్కోసారి నిమిషంలో రాసేస్తా, ఒక్కోసారి రోజుల సమయం పడుతుంటుంది.

అజయ్, కాజోల్

సామాజిక మాధ్యమాలకు మీ పిల్లలు దూరంగా ఉంటారా?

అమ్మాయి నైసాను నేను ఎప్పుడూ అది చేయకు ఇది చేయకు అని చెప్పలేదు. ఈ విషయంలోనూ అంతే. అబ్బాయికి సోషల్‌ మీడియా అంటే కూడా తెలియని వయసు. వాడితో సమస్య లేదు.

మీ దృష్టిలో సామాజిక మాధ్యమాల్లో చేయాల్సినవి, చేయకూడని పనులు ఏంటి?

నేను చేయాల్సినవి ఏం లేవు. చేయకూడనివి అంటే.. అవసరం లేని పోస్టులు పెట్టడం, వ్యక్తిగత వివరాలు పంచుకోవడం.

మీ ఫోన్‌లో మీరు ఎక్కువగా వినియోగించే అప్లికేషన్‌?

వర్డ్స్‌ క్యాప్స్‌

ఈ రోజుల్లో ప్రేమపై మీ అభిప్రాయం?

అవసరం.

మీ ప్రేమ విషయంలో ఎప్పుడైనా కష్టం అనిపించిన సంఘటన?

పెళ్లి చేసుకోవడం. అంతకు మించిన కష్టం లేదు కదా (నవ్వుతూ).

కాజోల్‌ మీకిచ్చిన వాటిలో విలువైంది ఏది?

తను నన్ను సొంతం చేసుకునేందుకు ఎన్నో త్యాగాలు చేసింది. వాటిని ఎప్పటికీ మర్చిపోలేను.

ఏ పాట మీ జీవితానికి సరితూగుతుంది?

మైన్‌ జిందగీ కా సాత్‌ (1961లో వచ్చిన 'హమ్‌ దోనో' చిత్రంలోనిది)

ఇవీ చూడండి.. 'పైరసీని ప్రోత్సహిస్తే.. నాణ్యమైన చిత్రాలు రావు'

ABOUT THE AUTHOR

...view details