తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫ్యాన్స్​కు సారీ చెప్పిన 'మహాసముద్రం' డైరెక్టర్ - movie latest news

'మహాసముద్రం' సినిమాతో అంచనాలు అందుకోలేకపోయానని డైరెక్టర్ అజయ్ భూపతి అన్నారు. ఓ అభిమాని ట్వీట్​కు రిప్లై ఇస్తూ.. ఇలా చెప్పుకొచ్చారు.

ajay bhupathi
డైరెక్టర్ అజయ్ భూపతి

By

Published : Oct 29, 2021, 11:03 AM IST

'ఆర్‌ఎక్స్‌ 100' (RX100) వంటి ఇంటెన్స్ ప్రేమకథా చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సూపర్‌హిట్‌ అందుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi). ఆ సినిమా విజయంతో ఆయనకు యువతలో క్రేజ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన తీసిన సరికొత్త చిత్రం 'మహాసముద్రం' (MahaSamudram).

ప్రేమ, స్నేహాం, వైరం వంటి సున్నితమైన అంశాలతో సిద్ధమైన ఈ కథ అజయ్‌ భూపతి కలల ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందింది. ఇలా, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌ అజయ్‌ భూపతిని ట్యాగ్‌ చేస్తూ.. "మహాసముద్రంపై మేము ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం అన్నా.. ఎందుకు అలా తీశావు" అని ట్వీట్‌ చేశాడు. దానిపై స్పందించిన అజయ్‌ క్షమాపణలు తెలిపారు.

"మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. అందర్నీ సంతృప్తి పరిచే కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను" అని అజయ్‌ రిప్లై ఇచ్చారు.

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మహాసముద్రం'. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, అదితి రావు హైదరీ కథానాయికలుగా నటించారు. జగపతిబాబు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మాం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details