బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడింది. కొన్ని రోజులుగా బిగ్‌బీ, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగటివ్ రావడం వల్ల వారు డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
"మేము కోలుకోవాలని ఎల్లవేళలా ప్రార్థిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు. మీ రుణం తీర్చుకోలేనిది. ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. వారు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. నేను, తండ్రి అమితాబ్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగిస్తున్నాం".