తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ 'కౌసల్య కృష్ణమూర్తి'తో టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు చేరువైంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో తన నటనతో మెప్పించింది.
ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ భామ నెట్టింట వైరల్‌గా మారింది. ఏ సినిమా చిత్రీకరణో తెలీదు గానీ... రోడ్డు పక్కన టిఫిన్ బండిపై గుడ్డు దోశ వేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. గుండ్రంగా దోశ వేసి బాగా వేశానంటూ ఎంతో హుషారుగా కేరింతలు కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.