బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ పోలికలతో ఉన్న అమృతా సాజు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ సెన్సేషనల్ స్టార్‌గా మారింది. ఆ వీడియో యాప్‌లో అమృతను లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఐశ్వర్యను మైమరిపిస్తున్న ఈ అమ్మాయిది కేరళలోని తొడుప్పుజా. కొన్ని ప్రకటనల్లోనూ కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమృతను చూసి చాలా మంది హీరోయిన్ అని భ్రమపడ్డారు. కానీ, ఆమెకు ఇటీవలే హీరోయిన్గా ఓ మలయాళ మూవీలో ఛాన్స్ లభించింది.
మలయాళ చిత్రం 'పికాసో'లో అమృత హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సునీల్ కరియట్టుకర దర్శకత్వం వహిస్తుండగా.. షేక్ అఫ్సాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.